అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నాం: సింగపూర్ సంచలన ప్రకటన

  • స్వయంగా వెల్లడించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్
  • ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టీకరణ
  • అమరావతికి పెట్టుబడులు కొనసాగుతాయని ఆకాంక్ష 
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్టు సింగపూర్ సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి ఈశ్వరన్ స్వయంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన పరస్పర అంగీకారం తరువాత సింగపూర్ కన్సార్టియం ఈ ప్రాజెక్టుకు దూరం జరిగిందని ఆయన తెలిపారు.

తాము తప్పుకున్న కారణంగా పెట్టుబడులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో తాము పెట్టే పెట్టుబడులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. కాగా, ఇదే విషయమై నిన్న రాత్రి జగన్ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు విడుదల చేసింది. సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని ప్రకటించింది.
Go Back to Shorts
Amaravati
Singapore
Eshwaran
Capital
Andhra Pradesh

More Telugu News